మెదక్ రైల్వే స్టేషన్ అమృత్ భారత్ స్టేషన్ కు ఎంపిక

ఇది శుభ పరిణామం 

జిల్లా కలెక్టర్ రాజర్షి షా 

తెలంగాణ ప్రభ (మెదక్): మెదక్ రైల్వే స్టేషన్ అమృత్ భారత్ స్టేషన్ కు ఎంపిక కావడం శుభ పరిణామం అని మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. స్థానిక మెదక్ పట్టణంలో ఉన్న రైల్వే స్టేషన్  లో అమృత్ భారత్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా వర్చువల్ గా సోమవారం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మెదక్ పట్టణంలో ఉన్న  రైల్వే స్టేషన్ కు మౌలిక సదుపాయాల కోసం దాదాపు 16 కోట్లు కేటాయించారని, దీనితో మౌలిక సదుపాయాలు ఆధునీకరించడం వల్ల జిల్లా ప్రజలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. 

మెదక్ రైల్వే స్టేషన్ లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం వల్ల జిల్లాలో వ్యవసాయం, పారిశ్రామిక, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. మహిళలకు, విద్యార్థులకు, ఉద్యోగులకు అలాగే సుదూర ప్రాంతాలకు ప్రయాణించే వారికి లబ్ది చేకూరుతుందన్నారు. 

వికసిత భారత్ కార్యక్రమంలో వివిధ పోటీలలో పాల్గొని గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, మెదక్ మున్సిపల్ ఛైర్మన్ చంద్రపాల్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, రైల్వే సీనియర్ డిఈ శ్రీతేజ, అధికారులు రహమాన్, రాజు, నర్సింహరావు, వినయ్, మెదక్ స్టేషన్ సూపరిoటెండేoట్ రమేష్, స్టేషన్ మాస్టర్ పద్మరావు, నవనీత్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

.