మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా
తెలంగాణ ప్రభ (మెదక్): మెదక్ జిల్లాలో మార్చ్ 3, 4, మరియు 5 తేదీలలో నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ తెలిపారు.
జిల్లా కలెక్టర్ అధ్యక్షతన పల్స్ పోలియో కార్యక్రమం గురించి డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది.
జిల్లాలో 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 157 ఆరోగ్య ఉప కేంద్రాలు,1,74,534 నివాసపు ఇండ్లు, 25 ట్రాన్సిట్ పాయింట్లు,176 హైరిస్క్ కేంద్రాలలో 523 పోలియో బూత్ కేంద్రాలు, 1046 టీముల ద్వారా 53 రూట్లలో 2332 వ్యాక్సినేటర్లచే మెదక్ జిల్లాలో నిర్దేశించబడిన 67962 మందికి అప్పుడే పుట్టిన పిల్లలనుండి 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలు వేయాలని తెలిపారు. మార్చి 3న పోలియో బూత్ కేంద్రాలలో మార్చి 4, 5 తేదీలలో మిగిలిపోయిన పిల్లలందరికి ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సర్వలెన్స్ అధికారి డాక్టర్ మురారి రాజేంద్ర ప్రసాద్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి చందు నాయక్, జిల్లా విద్యాధికారి రాధా కిషన్ DWO బ్రహ్మాజీ , డిస్టిక్ యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ నాగరాజు, ఆర్టీసీ డిపో మేనేజర్ సుధ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
.