తెలంగాణ ప్రభ (మెదక్): తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ గా కే.శ్రీనివాస్ రెడ్డిని నియమించడం పట్ల టియుడబ్ల్యూజెయు మెదక్ జిల్లా అధ్యక్షులు ఎ.శంకర్ దయాళ్ చారి హర్షం వ్యక్తం చేశారు. జర్నలిస్టు హక్కుల ఉద్యమ నేతను నియమించడం చాలా సంతోషమన్నారు. ఇప్పటికైనా జర్నలిస్టుల అనేక సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా శంకర్ దయాల్ చారితో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి.జి. శ్రీనివాస్ శర్మ, అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు బుక్క అశోక్, రాష్ట్ర దాడుల వ్యతిరేక కమిటీ సభ్యులు మిన్పూరు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఏ. సంతోష్ కుమార్, కోశాధికారి దేవరాజ్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు బొందుగుల నాగరాజు, ఐజెయూ మాజీ సభ్యులు కంది శ్రీనివాస్ రెడ్డి, మహమ్మద్ ఫారుక్ హుస్సేన్, జిల్లా ఉపాధ్యక్షులు కే.భూమయ్యలు హర్షం వ్యక్తం చేశారు.
