తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): కొంపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధి "అపర్ణ పామ్ గ్రూస్" వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు సోమవారం కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద హ్యాట్రిక్ ఎమ్మెల్యే, అభివృద్ధి ప్రదాత వివేకానంద్ ని మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ. వివేకానంద మాట్లాడుతూ అపర్ణ పామ్ గ్రూస్ నూతన వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలుగా నియమితులైన సంగీత భాస్కర్ రెడ్డి తో పాటు పానల్ సభ్యులందరికీ శుభాకాంక్షలు. వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు తాత్కాలికమని, అభివృద్ధిలో అందరిని భాగస్వామ్యలు చేస్తూ అందరిని కలుపుకుపోవాలని, కాలనీ అభివృద్ధిలో తన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు.
ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యదర్శి గోపాలరావు, కోశాధికారి జగదీశ్వర్ రావు, ఉపాధ్యక్షులు బాలరాజ్, సంయుక్త కార్యదర్శి డాక్టర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
.