తెలంగాణ ప్రభ(ధర్మపురి): ధర్మపురి పట్టణంలోని కాశేట్టివాడలో మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు చిపిరిశెట్టి రాజేశ్ ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ధర్మపురి పట్టణంలోని కాశెట్టివాడలో అపెక్స్ జగిత్యాల హాస్పిటల్ వైద్యులు ముత్తినేని ప్రమోద్ సుమారు 500 మంది రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ఇటు వైద్య శిబిరాన్ని ఉదయం ప్రారంభించి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ప్రజల కొరకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని పలువురు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ, కాశేట్టివాడ నాయకులు తదితరులు పాల్గొన్నారు
