బీజేపీ విజయ సంకల్పయాత్ర

పాల్గొన్న జాతీయ నాయకులు మురళీధర్ రావు

మళ్ళీ మోడీ ప్రధాని కావడం ఖాయం - మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ .

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) బిజెపి రాష్ట్ర నాయకత్వం చేపట్టిన విజయ్ సంకల్పయాత్ర ఆదివారం కుత్బుల్లాపూర్ నియోజక వర్గానికి చేరింది.  కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి నలుమూలల నుండి బీజేపీ శ్రేణులు, భారీ బైక్ ర్యాలీగా కొంపల్లి కి చేరుకొని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తో పాటు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కి, బీజేపీ జాతీయ నాయకులు మురళీధర్ రావ్ కి స్వాగతం పలికారు.

కొంపల్లి నుండి ప్రారంభమైన ఈ యాత్ర సుచిత్ర, జీడిమెట్ల, ఐడీపీఎల్ మీదుగా సాగి జగద్గిరిగుట్ట లో జరిగిన భారీ రోడ్ షోతో ముగిసింది.

ఈ యాత్రలో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ , ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, బిజెపి జాతీయ నాయకులు మురళీధర్ రావు , మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి జిల్లా అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి తో కలిసి పాల్గొన్నారు.

కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, మూడోసారి   నరేంద్ర మోడీ ప్రధాని అవుతారని మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ అన్నారు. గత పది సంవత్సరాలుగా  ప్రధాని  నరేంద్ర మోడీ  అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి, దేశాన్ని ప్రగతి బాటలో నడిపాడని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్  అన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఎంతగానో ఉందని అన్నారు.

అయోధ్య శ్రీరామచంద్రుని ఆశీస్సులతో బిజెపి 400కు పైగా సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

వచ్చే ఎన్నికల్లో మల్కాజ్ గిరి నియోజకవర్గంలో బిజెపి జెండా ఎగరడం ఖాయమని, ప్రజలంతా మోడీ  వైపే ఉన్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యే ఫోటి ఉంటుందని, బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బీజేపీ రాష్ట్ర, జిల్లా, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

.