ప్రజా ప్రభుత్వంలో ప్రజల సమస్యలు పరిష్కరించడమే మా ద్వేయం

కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలను హనుమంత్ రెడ్డి 

తెలంగాణ ప్రభ, (కుత్బుల్లాపూర్):  బౌరంపేట్ లో కొలన్ హన్మంత్ రెడ్డి  ఎంపీపీగా ఉన్నప్పుడు పేదలకు సర్వే నెంబర్ 578, 580లో ఇళ్ల స్థలాలు ఇచ్చారు.ఆ స్థలంలో ఉన్నటువంటి లక్ష్మీనగర్-2,  అంబేద్కర్ నగర్-2 వాసులకు భూమి పట్టాలు, ఎలక్ట్రికల్ స్తంబాలు,  బోర్  ఉన్నా వారు కట్టుకున్న ఇళ్లను గత ప్రభుత్వంలో  కూల్చివేశారు. ఈ సందర్భంగా   సిపిఐ నాయకులు ఏసురత్నం  ఆధ్వర్యంలో ఆదివారం కుత్బుల్లాపూర్  కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని కలిసి వారి సమస్యను పరిష్కరించాలని కోరగా వెంటనే హన్మంత్ రెడ్డి  వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి వారి సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాది ప్రజా ప్రభుత్వం అని ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్న నా దృష్టికి వస్తే వెంటనే పరిష్కరించేలా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కె యాదయ్య, కె.మల్లేశం, భిక్షపతి, నదీమ్ పాషా, శ్రీను, భాస్కర్, సత్యనారాయణ, బాగారెడ్డి, అచ్చిరాజు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

.