ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల మంత్రి దామోదర్ రాజనర్సింహ సంతాపం

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత శుక్రవారం ఉదయం పటాన్చెరు సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల మంత్రి దామోదర్ రాజనర్సింహ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం జహీరాబాద్ పర్యటనకు వచ్చిన మంత్రి దామోదర్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి  సంతాపం తెలిపారు. ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న యువ ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమన్నారు. లాస్య నందిత మృతి నుండి ఆమె కుటుంబ సభ్యులు తేరుకునేలా భగవంతుడు ఆమె కుటుంబ సభ్యులకు మనోధైర్యం అందించాలని కోరారు ఈ సందర్భంగా ఆమె మృతికి సంతాపం ప్రకటించి  రెండు నిమిషాలు మౌనం పాటించారు.

.