ఘనంగా ఆదర్శ పాఠశాల వార్షికోత్సవం

తెలంగాణ ప్రభ (ధర్మపురి): ధర్మపురి మండలంలోని మగ్గిడి  ఆదర్శ పాఠశాలలో శుక్రవారం వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థిని విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను ఆకట్టుకున్నాయి. విద్యార్థులు విద్యతో సమాంతరంగా అన్ని రంగాల్లో రాణించాలని పాఠశాల ప్రిన్సిపాల్ ముత్యం బుచ్చన్న తెలిపారు. ఇట్టి వేడుకలలో బిగ్బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చి విద్యార్థులను అలరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యయపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


.