రాహుల్ గాంధీ నీ ప్రధానమంత్రి చేయడం కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి : కొలను హనుమంత రెడ్డి
తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన అభివృద్ధికి ఆకర్షితులై గాజులరామారం డివిజన్ దేవేందర్ నగర్ వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఎస్.కె అఫ్జల్ రియాజ్ ఖాన్ ఆధ్వర్యంలో 200 మంది కాంగ్రెస్ పార్టీ కుత్బుల్లాపూర్ ఇంచార్జ్ కొలను హనుమంత్ రెడ్డి సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల ఆరు గ్యారెంటీలలో ఇప్పటికే రెండు గ్యారెంటీలు అమలు చేశామని మిగతా గ్యారంటీలు కూడా త్వరలో అమలు చేస్తామన్నారు. అదేవిధంగా రాబోయే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లను గెలుచుకొని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త ఓ సైనికుల పని చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ముక్తార్ అహ్మద్ ,మాస్టర్ సాబ్, మహమ్మద్ జాకీర్, తదితరులు పాల్గొన్నారు.
.