ప్రభుత్వ భూములు కాపాడాలని వినతి

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్ ): ప్రభుత్వ భూములు  కాపాడాలని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో  కుత్బుల్లాపూర్ మండల డిప్యూటీ ఎమ్మార్వో అశ్విన్ కుమార్ కు శుక్రవారం వినతి పత్రం  ఇచ్చిన ఎమ్మార్పీఎస్ నాయకులు ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ విశ్వకర్మ  కాలనీలో సర్వే నంబర్ 190 లోగల భూములలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని వాటిని వెంటనే తొలగించి   ప్రభుత్వ భూమిని కాపాడాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్  మేడ్చల్ జిల్లా నాయకులు సిలువేరు శ్రీనివాస్ మాదిగ, రాస మల్ల యాదగిరి మాదిగ, సంఘీ మహేష్, యువసేన ప్రధాన కార్యదర్శి ఇసురం రమేష్ మాదిగ ,మహిళా జిల్లా అధ్యక్షురాలు నడిమి దొడ్డి సలోమి, మండల సీనియర్ నాయకులు మట్ట నరసింహులు,  రాజేందర్ పిళ్ళై తదితరులు పాల్గొన్నారు.

.