పట్టణంలోని మూడు చౌరస్తాల సుందీరకరణ
కాంగ్రెస్ నాయకులు జీవన్ రావు
తెలంగాణ ప్రభ (మెదక్): అభివృద్ధిలో అనారోగ్యానికి గురైన మెదక్ నియోజకవర్గాన్ని వైద్యం చేసి బాగు చేయడానికి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు కంకణం కట్టుకున్నారని మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకులు జీవన్ రావు తెలిపారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ మెదక్ పట్టణంలోని బల్దియా పరిధిలోని పలు దుకాణాల వేలం పాటను బహిరంగంగా నిర్వహించడం ఇందుకు నిదర్శనమని అన్నారు. భవిష్యత్ లో ఈ ప్రాంతానికి ఇంకా ఇరవై ఏండ్లు సేవకుడిగా సేవలందిస్తారని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి అంటే గతంలో నాలుగు గోడల మధ్య చర్చించుకొని కోట్లు గడించారని ఆయన ఎద్దేవా చేశారు. నేడు అభివృద్ధి అంటే బహిరంగంగా ఏం చేస్తారో చెప్పి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మున్సిపల్ దుకాణాల వేలంతో మెదక్ పట్టణ అభివృద్ధికి శ్రీకారం చుట్టారని చెప్పారు. అలాగే పట్టణంలోని మూడు చౌరస్తాలను సందరీకరించడం హర్షనీయమన్నారు. గతంలో పదవుల కోసం పెదవులు మూసుకొని పట్టణంలోని అభివృద్ధి చేయని దుస్థితి నెలకొందని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరంగా ఎమ్మెల్యే పనిచేస్తున్నారని తెలిపారు. అదే విధంగా ఏడుపాయల్లో పక్కా షెడ్ ల నిర్మాణానికి ఎమ్మెల్యే శ్రీకారం చుట్టడం సంతోషకరమన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి తాగునీటి సమస్య తీర్చుతున్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు బొజ్జ పవన్ ముత్యం గౌడ్, గూడూరు ఆంజనేయులు, కౌన్సిలర్లు బట్టి సులోచన తదితరులు పాల్గొన్నారు.
.