ఆడపిల్లలను ఉన్నత చదువులకు ప్రోత్సహించాలి : కలెక్టర్ రాజర్షి షా

బాల్య వివాహాలు నిర్మూలించాలి

బేటీ బచావో- బేటి పడావో సమీక్ష సమావేశంలో కలెక్టర్ రాజర్షి షా

తెలంగాణ ప్రభ ( మెదక్ ): బేటీ బచావో.. బేటి పడావో కార్యక్రమంపై మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 

ఆడపిల్లలపై వివక్ష జాఢ్యాన్ని రూపు మాపాలంటే వ్యవస్థలో మార్పు రావాలని అందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలని పిలుపునిచ్చారు.

ఆడపిల్లలను రక్షించడం, చదివించడం వలన సమాజంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని అన్నారు. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆడ పిల్లలు వివక్షకు గురవుతున్నారని అన్నారు. 

ఈ జాఢ్యాన్ని రూపుమాపాలంటే ముందు కుటుంబ వ్యవస్థలో మార్పు రావాలని అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.  అమ్మయిలు ధైర్యంగా సమస్యలను ఎదుర్కొని, బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు.

తల్లిదండ్రులు, టీచర్లు స్నేహాభావంతో ఉన్నపుడు సమాజంలో అమ్మయిలు ఎదుర్కొంటున్న సమస్యలను వారితో ధైర్యంగా చెప్పగలుగుతారని తెలిపారు.

అధికారులు, ఎన్జీఓలు గ్రౌండ్ స్థాయిలో విచారణ జరిపి సమస్యలను పరిష్కరించాలని, అమ్మయిలను గర్బస్థ శిశువు నుండి కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. బాల్య వివాహాలను అరికట్టాలని సూచించారు.

అనంతరం కలెక్టర్ అందరితో ప్రతిజ్ఞ చేయించారు. బేటీ బచావో- బేటీ పడావో పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ మహేందర్, జిల్లా విద్యాశాఖ అధికారి రాధా కిషన్, జిల్లా యువజన క్రీడల అధికారి నాగరాజు, డీడబ్ల్యుఓ  బ్రహ్మాజీ , మెప్మ పీడీ ఇందిర, 

సూపర వైజర్స్, చైల్డ్ లైన్ కోర్డినేటర్లు, వివిధ బాలల సంరక్షణ కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు.

.