ఇస్నాపూర్ గ్రామంలో వైభవంగా కోదండ సీతారామచంద్ర స్వామి ఆలయం ప్రతిష్ట మహోత్సవం

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో వైభవంగా శ్రీశ్రీశ్రీ కోదండ సీతారామచంద్ర స్వామి ఆలయం ప్రతిష్ట మహోత్సవం ఎంతో వైభవంగా సాగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ గారు హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు. అలాగే జిన్నారం మండలం లక్ష్మీపతి గూడెం గ్రామంలో ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో, అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని లింగమయ్య కాలనీలో నిర్వహించిన శ్రీ సీతారామస్వామి ఆలయ ధ్వజస్తంభ శిఖర ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయా ఆలయాల అర్చకులు వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించి తీర్ధ ప్రసాదాలను అందజేసి వారిని ఘనంగా సన్మానించారు.

.