సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ మంజు శ్రీ జైపాల్ రెడ్డి
తెలంగాణ ప్రభ (ఉమ్మడి మెదక్ బ్యూరో ): కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ మంజు శ్రీ జైపాల్ రెడ్డి విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. రామచంద్రపురం డివిజన్ పరిధిలోని శ్రీ గీతా భూపాల్ రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలను గురువారం కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. పటాన్చెరు ప్రాంతంలోని నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో 17 సంవత్సరాల క్రితం అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి సహాయ సహకారాలతో భూపాల్ రెడ్డి ఈ కళాశాలను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల అయినప్పటికిని కళాశాల అభివృద్ధికి అనునిత్యం అండగా నిలుస్తూ విద్యార్థులను బావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో భూపాల్ రెడ్డి పాత్ర ప్రశంసనీయమన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల బలోపేతానికి మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం కోట్ల రూపాయలు నిధులు ఖర్చు చేసిందని తెలిపారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా అన్ని మౌలిక వసతులు కల్పిస్తుందని అన్నారు. శ్రద్ధసక్తులతో చదివి తల్లిదండ్రులకు, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకుని రావాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కళాశాల విద్యార్థినీ విద్యార్థులు నిర్వహించిన సంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి.
ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, కార్పొరేటర్లు సింధు ఆదర్శ్ రెడ్డి, పుష్ప నగేష్ యాదవ్, మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, సిఐ నరేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు బాల్ రెడ్డి, పరమేశ్ యాదవ్, అంజయ్య, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
.