-బిఆర్ టియు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవిసింగ్...
తెలంగాణ ప్రభ, (కుత్బుల్లాపూర్): కూకట్ పల్లి బాలనగర్ ఇండస్ట్రియల్ ఏరియా లో "అశోక్ ఫ్యాబ్రికేషన్ ప్రైవేట్ లిమిటెడ్" కంపెనీలో స్వప్న అనే కార్మికురాలు గత 16 సంవత్సరాల నుంచి పనిచేసేవారు, కొన్ని అనివార్య కారణాలవల్ల కంపెనీకి కొన్ని రోజులు వెళ్లలేదు, అ తర్వాత కంపెనీకి వెళ్తే కంపెనీ యాజమాన్యం కంపెనీకి వద్దు అని యజమాన్యం పనిలో నుంచి తీసేయడం జరిగింది. స్వప్న అనే కార్మికురాలు యజమాన్యంతో నేను కంపెనీకి వస్తాను తీసుకోండి అని ఎన్నిసార్ల చెప్పిన యజమాన్యం మాత్రం నిర్లక్ష్యం వహించి తీసుకోలేదు.ఆ తర్వాత కార్మికురాలికి ఏం చేయాలో అర్థం కాక గత 16 సంవత్సరాల నుంచి డ్యూటీ చేస్తున్న కాబట్టి నాకు రావలసిన గ్రాడ్యుయేట్ ఇవ్వాలని ఎన్నిసార్లు అడిగినా కంపెనీ యజమాన్యం నిర్లక్ష్యం వహిస్తూ రావాల్సిన గ్రాడ్యుయేట్ ఇవ్వకుండా బయటకు పంపేవారు.గత కొన్ని రోజుల తర్వాత ఎవరైతే మనకు న్యాయం చేస్తారో అని తెలుసుకుని వాళ్ళకు తెలిసిన సన్నిహితుల ద్వారా బిఆర్ టియు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవిసింగ్ గురించి తెలుసుకొని తన ఆఫీస్ వద్దకు వచ్చి తనకు జరిగిన అన్యాయం గురించి వివరించారు.వెంటనే స్పందించిన కార్మిక నాయకుడు రవిసింగ్ హుటాహుటిన కంపెనీ వద్దకు బయలుదేరి కంపెనీ యజమాన్యంతో పలుమార్లు చర్చించి కార్మికురాలికి రావాల్సిన గ్రాడ్యుయేట్ మొత్తం 50/-వేల రూపాయలను ఇప్పించారు. కార్మికురాలు స్వప్న మాట్లాడుతూ నాకు న్యాయం చేసిన కార్మిక నాయకుడు రవిసింగ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు..ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ చారి,మనోజ్ కుమార్,అనిల్ కుమార్,సుదర్శన్,జగన్ తదితరులు పాల్గొన్నారు.
