పిల్లల్ని ఎత్తుకెళ్తున్నారన్న అనుమానంతో యువకుడుకి దేహశుద్ధి

తెలంగాణ ప్రభ ( సంగారెడ్డి ):చిన్నపిల్లలను ఎత్తుకెళ్తున్నారన్న ఓ వ్యక్తిని కాలనీవాసులు దేహశుద్ధి చేసిన సంఘటన సంగారెడ్డి పట్టణంలో బుధవారం జరిగింది. సంగారెడ్డి పట్టణం బైపాస్ రోడ్ లో ఒక వ్యక్తి ఇంటిలోని బాలుడిని  బయటికి రావాలని పిలుస్తుండగా బాలుడు తల్లి గమనించి కాలనీవాసులకు సమాచారం ఇచ్చింది. బాలుడిని ఎందుకు పిలుస్తున్నావని కాలనీవాసులు అడుగగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పిల్లల్ని ఎత్తుకొని పోయేవాడని అనుమానంతో స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. కాలనీవాసులు పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అతన్ని సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ కు తలించారు. పట్టుబడిన వ్యక్తి జార్ఖండ్ వాసిగా గుర్తించామని అలాగే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు.

.