మంజీరా పరివాహక ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలి

మెదక్ జిల్లా ఎస్పీ బి.బాలస్వామి 

తెలంగాణ ప్రభ (మెదక్ ): సింగూరు నీటి విడుదలతో మంజీరా పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెదక్ జిల్లా ఎస్పీ బి.బాలస్వామి సూచించారు. బుధవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ మాట్లాడుతూ సింగూరు నుంచి ఏడుపాయల మీదుగా మెదక్ జిల్లాకు వచ్చే వరద నీటిని విడుదల చేయడంతో ఈ ప్రాంత ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, జిల్లా పోలీసు శాఖ అవసరమైన పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. మంజీర నది పరివాహక ప్రాంతంలో నీటి ఉదృతి ఎక్కువగా ఉన్నందున ఈ ప్రాంతాల్లో ఉండే పశువుల కాపరులు,  గొర్రెల కాపరులు తగు జాగ్రత్తలు పాటించాలని ఏమైనా ఇబ్బందులు ఉంటే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. ఏదైనా విపత్కర పరిస్థితులు ఎదురైతే వెంటనే డయల్ 100 గానీ దగ్గరలోని పోలీస్ స్టేషన్ కి గానీ, పోలీస్ కంట్రోల్ రూమ్ 8712657888 కి సమాచారం ఇవ్వాలని ఎస్పీ బాలస్వామి తెలిపారు.

.