నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటా

ప్రజలకు సేవలందించడమే ఎంఎస్ఎస్ఓ లక్ష్యం

మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు

తెలంగాణ ప్రభ ( మెదక్): మెదక్ నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండడమే లక్ష్యం అని, నిరంతరం ప్రజలకు సేవలందించేందుకు మైనంపల్లి కుటుంబం అహర్నిషలు కృషి చేస్తుందని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. బుధవారం మెదక్ నియోజక వర్గంలో పలు కార్యక్రమాల్లో మైనంపల్లి హన్మంతరావు పాల్గొన్నారు. మొదటగా మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో చిన్నారుల పేరిట 25 వేల రూపాయలు ఫిక్సిడ్ డిపాజిట్ చేసిన పుస్తకాలను అందజేశారు. అనంతరం హావేళిఘణపురం మండలంలోని వాడి గ్రామంలోని శివాలయం  వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం హావేళిఘణపురం మండల కేంద్రంలో ఇంటర్నేట్ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం పాపన్నపేట మండలంలోని వివాహ వేడుకలో ముఖ్యఅతిథిగా పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుతూ ప్రజలకు సేవలందించడమే ఎంఎస్ఎస్ఓ ముఖ్య ఉద్ధేశ్యమని తెలిపారు. అందులో భాగంగా చిన్నారులకు ఫిక్సిడ్ డిపాజిట్ లతో పాటు మంచినీటి సమస్య లేకుండా నియోజక వర్గంలో నేటికి చాలా వరకు బోర్లు వేశామని ఆయన మరొకసారి గుర్తుచేశారు. అంతే కాకుండా మెదక్ నియోజక వర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఆయన పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో    చిన్నశంకరంపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగా నరేందర్, ఆవుల గోపాల్ రెడ్డి, హావేళిఘణపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పరుశురాం, అక్బర్, హావేళిఘణపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్కరు శ్రీనివాస్, లక్ష్మారెడ్డి, భాస్కర్, వాడి ప్రతాప్ రెడ్డి, లింగం, బొజ్జ పవన్, సంగమేశ్వర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

.