ఏబీవీపీ మేడ్చల్ జిల్లా కన్వీనర్ నాగేష్
తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మేడ్చల్ జిల్లా అధ్వర్యంలో బుధవారం కుత్బుల్లాపూర్ ఎంఈఓ కి వినతి పత్రం ఇచ్చిన మేడ్చల్ జిల్లా కన్వీనర్ నాగేష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకీ విద్యార్థులు పెరుగుతున్నట్టు పాఠశాలలు కూడా ఎక్కడపడితే అక్కడ నియమ నిబంధనలు లేకుండా జాగ్రత్తలు తీసుకోకుండా నిర్మాణం చేస్తున్నారు. కుత్బుల్లాపూర్ మండల్ లోని ఎంఈఓ పరిధిలో కొత్తగా చాలా పాఠశాలలు ఏర్పాటు చేశారు. ఇంటర్నేషనల్, వరల్డ్, గ్లోబల్, కిడ్స్ ,మోడల్, ప్లే పేరుతో నిర్మించిన పాఠశాలలు ఎటువంటి ఎన్ ఓ సి లు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం జీవో లను పాటించకుండా లక్షల లక్షల ఫీజులు దోచుకుంటూ అడ్మిషన్లు చేయడం విపరీతంగా అడ్వర్టైజ్మెంట్ చేయడం జరుగుతుంది. కావున వెంటనే ఎంఈఓ ఇలాంటి పాఠశాలలపై దృష్టి పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము అని అన్నారు.ఈ కార్యక్రమంలో చింతల్ నగర సంయుక్త కార్యదర్శి సాయి,పృథ్వీ తేజ కార్యకర్తలు పాల్గొన్నారు.
