తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): బౌరంపేట్ ఇందిరమ్మ కాలనీలో కౌన్సిలర్లు వనిత బుచ్చిరెడ్డి, నాచారం సునిత మురళి యాదవ్ ల ఆధ్వర్యంలో బుధవారం జరిగిన శ్రీశ్రీశ్రీ దాసాంజనేయ స్వామి సహిత మల్లికార్జున స్వామి ఆలయ 2వ వార్షికోత్సవం జాతర మహోత్సవాలకు ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు హాజరయ్యారు. స్థానిక నాయకులు , పెద్దలతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని స్వామివారి దీవెనలతో మనమంతా సుఖసంతోషాలతో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో బౌరంపేట్ పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, దుండిగల్ మున్సిపల్ వైస్ చైర్మన్ పద్మారావు, కౌన్సిలర్లు అర్కల అనంతస్వామి, జక్కుల కృష్ణ యాదవ్, ఆనంద్, జక్కుల శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు జగన్, మంత్రి సత్యనారాయణ, బౌరంపేట్ పీఏసీఎస్ వైస్ చైర్మన్ నల్తూరి కృష్ణ, గాజులరామారం డివిజన్ పార్టీ అధ్యక్షులు విజయ్ రామ్ రెడ్డి, నాయకులు ఎంబరి ఆంజనేయులు, బైండ్ల గోపాల్, కామేష్, సోమరాజు, నర్సింహా రెడ్డి, తదితరులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
