తెలంగాణ ప్రభ (శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం కూకట్‌పల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి నగర్ కాలనీలో గల శ్రీ వీరాంజనేయ శివాలయ దేవస్థానం 17 వ వార్షికోత్సవములో స్థానిక ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవ రెడ్డి, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, పాపిరెడ్డి నగర్ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ చంద్రారెడ్డి, గడ్డం రాజేశ్వర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, ధర్మారావు, భగవంతు రెడ్డి, నర్సింలు ముదిరాజు, అనంత రాములు, రామకృష్టారెడ్డి, తడకల రాజిరెడ్డి, కాశీనాథ్ యాదవ్, ఎల్లం నాయుడు, కన్నారవు శ్రీనివాస్ రెడ్డి, సంపత్ రెడ్డి భక్తులు పాల్గొన్నారు.
