మెదక్ జిల్లాకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలి : మెద‌క్ జిల్లా ఎస్పీ డాక్ట‌ర్ బి.బాలస్వామి

ట్రైనీ కానిస్టేబుళ్ళకు కిట్ ఆర్టికల్స్ అందజేత 

తెలంగాణ ప్ర‌భ (మెద‌క్‌): మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ డాక్ట‌ర్ బి.బాలస్వామి ఆద్వర్యంలో నూతనంగా పోలీస్ కానిస్టేబుళ్లుగా ఎంపికై శిక్షణ కోసం వివిద ట్రైనింగ్ సెంటర్లకు వెళ్తున్న‌మొత్తం 152 మంది ఎస్‌సీటీపీసీల‌కు కిట్ ఆర్టిక‌ల్స్ అంద‌జేశారు. అందులో మాహిళా శిక్షణా కానిస్టేబుళ్లు 39 మంది, శిక్షణా కానిస్టేబుళ్లు 113 మంది ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బాల‌స్వామి మాట్లాడుతూ మెదక్ జిల్లా పోలీస్‌ శాఖకు కీర్తి ప్రతిష్టలు తీసుకవచ్చే రీతిలో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకోవాలని ట్రైనీ కానిస్టేబుళ్ళకు సూచించారు. పోలీస్‌ కానిస్టేబుళ్ళ నియామకంలో భాగంగా స్టయిఫండరీ ట్రైనీ పోలీస్‌ కానిస్టేబుళ్ళుగా ఎంపికై  తొమ్మిది నెలల శిక్షణకు వెళ్ళుతున్న ట్రైనీ కానిస్టేబుళ్లకు తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ అకాడమీతో పాటు 8 వ బెటాలియన్ కొండాపూర్, పిటిసి వరంగల్, సిటీసీ సైబరాబాద్ లలో తొమ్మిది నెలల శిక్షణ అందజేయబడుతుందని తెలిపారు. నేటి పరిస్థితులకు తగ్గట్లుగా ప్రజలకు సేవలందించే రీతిలో ట్రైనీ కానిస్టేబుళ్ళకు శిక్షణ సమయంలో మానసికంగా, శారీరకంగా, అలాగే వివిధ అంశాలపై అవగాహన కల్పించే తరహాలో శిక్షణ అందించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. అనంతరం శిక్షణకు తరలివెళ్తున్న ట్రైనీ కానిస్టేబుళ్ళకు కిట్‌ ఆర్టికల్స్‌ జిల్లా సిబ్బందితో  కలిసి అందించారు.


ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఎస్.మహేందర్, డిసిఆర్బి డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సైబర్ సెల్ డీఎస్పీ సుభాష్ చంద్ర బోస్, ఏ.ఆర్ డీఎస్పీ రంగ నాయక్‌, ఏ.ఓ  లక్ష్మి, సూపరింటెండెంట్ లు వలియా నాయక్,  అనురాధ, ఎస్.బి సీ.ఐ సందీప్ రెడ్డి, ఎంటి ఆర్.ఐ నాగేశ్వర్ రావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

.