తెలంగాణ ప్రభ (ఎల్లారెడ్డిపేట): అనుమతి పత్రాలు లేకుండ ఇసుకను తరలిస్తున్న పికప్ వాహనాన్ని పోలీసులు పట్టుకొని సీజ్ చేశారు.
ఎల్లారెడ్డిపేట శ్రీనివాస్ హెడ్ కానిస్టేబుల్ తన సిబ్బందితో సోమవారం గొల్లపల్లి శివారులో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా పికప్ వాహనంలో ఇసుకతో వెళ్ళడాన్ని గమనించి వెంటనే ఇసుక అనుమతి పత్రం అడుగగా డ్రైవర్ గంతుల సత్తయ్య లేవు అనడంతో వాహనాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించి డ్రైవర్ పై కేసు నామోదు చేసినట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు.పర్మషన్ లేకుండ ఇసుకను తరలిస్తే కఠనమైన చర్యలు తీసుకొని కేసులు నామోదు చేస్తామని హెచ్చరించారు.
.