ఘనంగా చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు

తెలంగాణ ప్రభ, (తంగళ్ళపల్లి); తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామంలో సోమవారం శివాజీ మహారాజ్ 394వ జయంతి వేడుకలను బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు కాసుగంటి రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హైందవ జాతి రక్షనే ధ్యేయంగా విధర్మీయుల గుండెల్లో నిద్రించిన ధీరుడు, ధర్మ రక్షనే ధ్యానంగా తపించిన ధర్మవీరుడు, హిందుత్వమే ప్రాణంగా, స్వాభిమానమే ఆయుధంగా జాతి పౌరుషాన్ని చాటిన శత్రు భయంకరుడు, హిందూ హృదయ సామ్రాట్ చత్రపతి శివాజీ మహారాజ్ నేటి యువతకు ఆదర్శం అని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. అనంతరం ఇటీవలే అనారోగ్యంతో మరణించిన రాగుల బాలయ్య కుటుంబానికి 50 కేజీల బియ్యాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శివాజీ యూత్ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

.