యువతీ, యువకులు నూతన ఓటరుగా నమోదు చేసుకోవాలి

మెద‌క్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా

తెలంగాణ ప్ర‌భ (మెద‌క్ ): నూత‌నంగా 18 ఏళ్లు నిండిన యువ‌తీ, యువకులు తప్పని సరిగా ఓటు నమోదు చేసుకోవాలని, భవిష్యత్తును మార్చుకోవాలని మెద‌క్ జిల్లా క‌లెక్ట‌ర్ రాజ‌ర్షి షా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫోరమ్ 6  ద్వారా నమోదు చేసుకున్న వారి ఓటును బీఎల్‌వోలు, బీఎల్ఓ సూపర్ వైజర్ల‌ ద్వారా ఆన్‌లైన్ ప్రక్రియ వేగవంతం చేయించాలని తెలిపారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాలమేరకు   01 ఏప్రిల్ 2024 నాటికీ 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులు నూతన  ఓటరుగా  ఫారం 6  ద్వారా  నమోదు చేసుకోవాలని సూచించారు. కొత్త ఓటర్లుగా నమోదు చేసుకునేలా అవగాహన కలిగిస్తూ అధికారులు ప్రోత్సహించాలని కోరారు. ఓటరు  జాబితాలో మార్పులు, చేర్పుల కోసం బూతు లెవల్  అధికారులకు దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. గ్రామాల వారీగా ఫామ్ 6  త్వరిత గతిన ఆన్‌లైన్‌ పక్రియ పూర్తి చేయాలని సూచించారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా నూతనంగా ఓటరు నమోదుపై విస్తృత అవగాహన క‌లిగి ఉండాల‌న్నారు.

.