చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ

పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలను హనుమంత్ రెడ్డి

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్ ): గాజులరామారం డివిజన్ మహదేవపురం చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ కుత్బుల్లాపూర్ ఇంచార్జ్ కొలను హనుమంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మరాఠా యోధుడు విదేశీ ముస్లింలు మొగల్ సామ్రాజ్యంపై విజయం సాధించిన గొప్ప యోధుడు శివాజీ మహారాజ్ అని అన్నారు. ఆయన తన రాజ్యంలోని ప్రజల కోసం చివరి వరకు పోరాడాడని తన ఆశయాలను ముందుండి మనమందరం కొనసాగించాలని అన్నారు .ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి సొంటి రెడ్డి పున్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిద్ధనోళ్ల సంజీవరెడ్డి మహాదేవపురం కాలనీ వాసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

.