మెదక్ మాజీ ఎమ్మెల్యే కారు డ్రైవర్ ఉరివేసుకొని ఆత్మహత్య

తెలంగాణ ప్రభ ( మెదక్ ): కుటుంబ కలహాలతో విరక్తి చెంది మెదక్ మాజీ ఎమ్మెల్యే కారు డ్రైవరు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లి గ్రామానికి చెందిన శివ రాములు (42) గతంలో మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి వద్ద కారు డ్రైవర్ గా పనిచేసేవాడు. శివ రాములు మెదక్ పట్టణంలోని భార్య, ఇద్దరు పిల్లలతో  పిల్లికొట్టాల లో నివాసం ఉంటున్నాడు.

అయితే ఆదివారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరుగగా మనస్థాపం చెందిన శివరములు భార్య ఇంట్లో లేని సమయంలో తన బెడ్ రూమ్ లోనే ఆదివారం రాత్రి ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం శివరాములు కొడుకు నిద్రలేచి చూడగా ఫ్యానుకు వేలాడుతున్న తన తండ్రి మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

.