ఎల్లారెడ్డిపేటలో మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తి అదృశ్యం : ఆచూకీ కోసం గాలిస్తున్న కుటుంబ సభ్యులు

(తెలంగాణ ప్రభ ఎల్లారెడ్డిపేట): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన నేవూరి చంద్రారెడ్డి (70 ) అనే వ్యక్తి సోమవారం ఉదయం నుంచి  కనిపించడం లేదు

అతని కుటుంబ సభ్యులు తన ఆచూకీ కోసం ఉదయం నుంచి గాలిస్తున్నారు,

నేవూరి చంద్రారెడ్డి  సంవత్సర కాలంగా మతిస్థిమితం కోల్పోయి  అనారోగ్యంతో ఉంటున్నాడు,

సోమవారం ఉదయం నిద్ర లేచి ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు తిరిగి ఇంటికి రాలేదు దీంతో అతని ఆచూకీ కోసం అతని కుటుంబ సభ్యులు గాలిస్తూనే ఉన్నారు ఆచూకీ లభించలేదు,

అతనికి భార్య లక్ష్మి , కుమారులు ప్రభాకర్ రెడ్డి , సుధాకర్ రెడ్డి,  కూతురు వెంకటవ్వలు  ఉన్నారు,

కుమారులు ప్రభాకర్ రెడ్డి మస్కట్,  సుధాకర్ రెడ్డి బేహారన్ దేశం కు  ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లారు,

చంద్రా రెడ్డి తప్పిపోయినట్లు వారి కుటుంబ సభ్యుల ఫిర్యాదు అందింది విచారణ జరిపి మిస్సింగ్ కేసు నమోదు చేస్తామని ఎస్సై రమాకాంత్ తెలిపారు

.