ఘనంగా శ్రీ షిరిడి సాయిబాబా 26వ వార్షికోత్సవ వేడుకలు

కన్నుల పండుగగా శోభ యాత్ర, కుంకుమ పూజ

తెలంగాణ ప్రభ (ఎల్లారెడ్డిపేట): ఎల్లారెడ్డిపేట మండలం బండ లింగంపల్లి గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో 26 వ  వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి,

సోమవారం ఉదయం సుప్రభాతం,  స్వామివారి పల్లకి సేవ శోభయాత్ర గ్రామంలో ప్రధాన వీధుల గుండా కన్నుల పండుగగా ఆలయం చేరుకుంది,

అనంతరం స్వామివారికి నిత్య పూజ, కుంకుమ పూజ, గణపతి పూజ , స్వస్తి పుణ్యవచనం,  నవకల్ష స్థాపన , నవగ్రహ పూజ , నవగ్రహ హోమం , హారతి,  మంత్రపుష్పం , ఝత్విక్ ,  మహాదాశీర్వచనం ,ఘనంగా జరిగాయి,

ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ బైరోజు అన్వేష్ ఆచార్య,  బ్రహ్మశ్రీ ఉప్పుల అభిలాష్ ఆచార్య భక్తకోటికి తీర్థ ప్రసాద వితరణ చేశారు, అనంతరం అన్న ప్రసాదం  వితరణ చేశారు,

ఎల్లారెడ్డిపేట సత్సంగ సదనం అధ్యక్షులు శ్రీ బ్రహ్మచారి లక్ష్మారెడ్డి ఆద్వర్యంలో భగవద్గీత ఉపన్యాస కార్యక్రమాలు జరిగాయి, 

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ముస్తాబాద్ శ్రీ రాజు గురుస్వామి పాల్గొన్నారు ,  

ఆలయ కమిటీ అధ్యక్షులు  నర్ర అంజిరెడ్డి,  ధర్మకర్త బాలరాజు బాల్ నర్సా గౌడు, వార్షికోత్సవ కార్యక్రమాలను పర్యవేక్షించారు, 

స్వామివారి ఆలయంలో అఖండ భజన కార్యక్రమం  నిర్వహించగా 10 గ్రామాల భజన మండలిలు పాల్గొని భజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాయి, అఖండ భజన కార్యక్రమంలో పాల్గొన్న భజన మండలి సభ్యులను ఆలయ కమిటీ వారు ఘనంగా సన్మానం చేశారు, 

26 వ వార్షికోత్సవ కార్యక్రమంలో  బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆగయ్య, ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి సభ్యులు  లక్ష్మణరావు, సెస్ డైరెక్టర్ వరుస కృష్ణాహారి,  ఎల్లారెడ్డిపేట సింగల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి,  బిఆర్ఎస్ పార్టీ నాయకులు  నరసింహారెడ్డి , జంగ అంజిరెడ్డి,  మాజీ సర్పంచ్ బాలరాజు నర్సా గౌడ్ , బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నరసయ్య , జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్ బాయి , మాజీ సర్పంచ్ కొత్తపెళ్లి వాణి నరసింహులు ,  ఎంపీటీసీ సభ్యురాలు కొత్తపల్లి పద్మ దేవయ్య , బిఆర్ఎస్ పార్టీ నాయకులు  బండారి బాల్ రెడ్డి,   చెన్ని బాబు, గిరిధర్ రెడ్డి ,  జంగా అంజిరెడ్డి, బాలరాజు రమేష్ గౌడ్ , ఇమామ్ మార్పు బాలచందర్ రెడ్డి , పారిపెల్లి రాంరెడ్డి,  యమగొండ కృష్ణారెడ్డి, బాలరాజు , రేపాక  రమేష్ ,  తుమ్మల నవీన్, కొండే రాజు , హైమద్  తదితరులు పాల్గొని స్వామివారి ని దర్శించుకున్నారు.

.