తెలంగాణ ప్రభ (కోరుట్ల): సాదించుకున్న తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి తగిన ప్రాధాన్యత కల్పించాలని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పేట భాస్కర్ కోరారు.
శనివారం సాయంత్రం హైదరాబాద్ సెంట్రల్ కోర్ట్ హోటల్లో జరిగిన తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళన రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ గజ్జెల కాంతం,మాదిగ విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పిడమర్తి రవి,కత్తి వెంకటస్వామిలతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పేట భాస్కర్ మాట్లాడుతూ ప్రజాపాలనలో తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాబై గజాల స్థలంతోపాటు ఇంటి నిర్మాణం చేయిస్తామని ధరఖాస్తులు స్వీకరించడాన్ని స్వాగతిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యమకారులకు ఫించన్ల సౌకర్యం కల్పించాలని కోరారు.
.