17వ జీర్డ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ వార్షికోత్సవాలు

తెలంగాణ ప్రభ (కోరుట్ల): భీమారం మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో జీర్డ్స్ స్వచ్ఛంద సంస్థల 17వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి వేములవాడ బిఆర్ఎస్ ఇంచార్జ్ చల్మేడ లక్ష్మీనరసింహారావు ముఖ్యఅతిథిగా విచ్చేశారు.

జిల్లా స్థాయిలో వివిధ శాఖలలో సామాజిక సేవలు అందిస్తున్న సుమారు 100 మంది సామాజిక సేవకులను గుర్తించి జీర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ అధినేత అంగడి ఆనంద్ ఆధ్వర్యంలో గ్రామీణ స్థాయిలో సేవలకు గాను పురస్కారాలు అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా లక్ష్మీనరసింహారావు మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో సేవలను గుర్తించి వారికి అవార్డులు అందజేయడం అంటే వారి సేవలను గుర్తించి ఇంకా ముందు ముందు మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకున్నట్టేనని, ఇది గ్రామీణ ప్రాంత సంబంధాలను బలోపేతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో హరి చరణ్ రావు, అంకం సాగర్, తన్నీరు శ్రీనివాసరావు, చెన్నమనేని అజిత్ రావుతో పాటు పెద్దఎత్తున సామాజిక సేవకులు పాల్గొన్నారు.

.