తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్ ): జగద్గిరిగుట్ట బస్టాండ్ లో యువ నాయకులు కొలుకుల జైహింద్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పుట్టినరోజు వేడుకలకు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు హాజరై కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ తెలంగాణ జాతిపిత కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా సుఖ సంతోషాలతో ఉండాలని మళ్లీ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు .ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, కొలుకుల జగన్,రావుల శేషగిరి, మంత్రి సత్యనారాయణ,హేమలత సురేష్ రెడ్డి,మమ్మద్ రఫిక్, డివిజన్ అధ్యక్షులు రుద్రా అశోక్, సీనియర్ నాయకులు రషీద్ ,బండా మహేందర్, దాసు, ముఖేష్ ,సాజిత్, జిహెచ్ఎంసి డివిజన్లో.అధ్యక్షులు పార్టీ సీనియర్ నాయకులు మహిళా నాయకురాలు. పార్టీ కుటుంబ సభ్యులు పారిశుధ్య కార్మికులు, మహిళలకు పండ్లను పంపిణి చేశారు తదితరులు పాల్గొన్నారు.
