తెలంగాణ ప్రభ, (తంగళ్ళపల్లి); తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసిఆర్ 70వ జన్మదిన వేడుకలను శనివారం తంగళ్ళపల్లి మండలం మండేపల్లి ఇందిరమ్మ కాలనీ లోని వృద్ధాశ్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గజబింకార్ రాజన్న ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ పడిగల మానస రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వృద్ధాశ్రమంలోని వృద్ధులకు పండ్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మరియు వృద్ధాశ్రమం సిబ్బంది పాల్గొన్నారు.
