ఎమ్మెల్యే గాంధీ స్వగృహంలో ఘనంగా మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు

తెలంగాణ ప్రభ (శేరిలింగంపల్లి): తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు శనివారం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ 60 ఏళ్ల తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షను 14 ఏళ్ళల్లో నెరవేర్చిన ఉద్యమ నేత, తెలంగాణ ఉద్యమ రథసారథి, తెలంగాణ జాతిపిత కల్వకుంట్ల చంద్రశేఖర రావు 70వ జన్మదినం జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మాధవరం రోజాదేవి రంగరావు, దొడ్ల వెంకటేష్ గౌడ్,  ఉప్పలపాటి శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

.