తెలంగాణ ప్రభ, (తంగళ్ళపల్లి); తంగళ్ళపల్లి ఎస్సైగా దాస సుధాకర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన కె.ప్రశాంత్ రెడ్డి బదిలీపై ఇల్లంతకుంట వెళ్లగా ఆయన స్థానంలో ఇల్లంతకుంట నుండి బదిలీపై దాస సుధాకర్ ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మండలంలోని శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలని కోరారు.
