పార్లమెంటు ఎన్నికలకు అధికారులు సిద్ధం కావాలి : సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): రానున్న పార్లమెంట్ ఎన్నికలకు అధికారులందరు సిద్దంగా ఉండాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అధికారులతో శుక్రవారం నాడు జిల్లా కలెక్టర్ క్రాంతి జిల్లా ఎస్పీ రూపేష్ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫ్రీ అండ్ ఫేర్ ఎన్నికల నిర్వాహనే లక్ష్యంగా వంద శాతం పోలింగ్ నమోదు అయ్యేలా అధికారులందరు కృషి చేయాలని సూచించారు. ఐదు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి జిల్లాలో పోలింగ్ జరగనుందని, వివిధ శాఖలకు చెందిన అధికారులకు వర్క్ అసైన్ చేస్తూ, తమకు కేటాయించిన వర్క్ ను సమర్ధవంతంగా నిర్వహించినప్పుడే ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగుతుందని అన్నారు. గత ఎన్నికలలో ఎదురైన సమస్యల పట్ల దృష్టి సారించి, వాటిని అధిగమించాలని సూచించారు. ప్రతి సెంటర్ నందు వీల్ చైర్, అవసరాన్ని బట్టి బ్రెయిలీ బాలెట్ పేపర్స్ అందుబాటులో ఉండే విధంగా చూడాలని అధికారులకు సూచించారు. అనంతరం ఎస్పీ  రూపేష్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 9 చెక్ పోస్ట్ లు ఉన్నాయని, అవసరాన్ని బట్టి మరిన్ని చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేస్తామని అన్నారు. జిల్లా నలుమూలల సరిహద్దు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి,  అక్రమ డబ్బు, మద్యం రావాణాను నివారించడం జరుగుతుందన్నారు.  జిల్లా ప్రజలందరు ఎన్నికల ప్రవర్తన నియమావళికి కట్టుబడి ఉండాలని, ఎవరు కూడా ఇతర పార్టీలను గాని వ్యక్తులను గాని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయరాదని అన్నారు.  ఎవరైనా ఎన్నికలకు సంబంధించి తప్పుడు సమాచారన్ని సోషల్ మీడియాలో, గ్రూప్ లలో పోస్ట్ చేసినటలైతే ఎలక్షన్ నియమాల్ని ఉల్లంగించినట్లు అవుతుందన్నారు.  

ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, కామారెడ్డి అదనపు కలెక్టర్ మనుచౌదరి, అదనపు ఎస్పీ సంజీవరావు, వివిధ శాఖలకు చెందిన అధికారులు, రెవిన్యూ డివిజనల్ అధికారులు పాల్గొన్నారు.

.