ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి సామాజిక కార్యకర్త కోల రవీందర్ ముదిరాజ్

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం వల్ల వేలాది ఆటో కార్మికులు జీవన ఉపాధి కోల్పోయారని  పర్యావరణ సామాజిక కార్యకర్త కోలా రవీందర్ ముదిరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం సూరారం చౌరస్తా  దీక్షలో పాల్గొని వారికి మద్దతు తెలిపారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత రవాణా వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయి ఆటో ఫైనాన్స్ కట్టలేక రాష్ట్రవ్యాప్తంగా సుమారు 16 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించి వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.

.