కోరుట్ల పట్టణంలో పేదల గుడిసెలపై రాష్ట్ర ప్రభుత్వ దౌర్జన్యం నశించాలి

కూల్చిన గుడిసెలకు నష్ట పరిహారం చెల్లించాలి.

ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

CPM కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ , చేరుపల్లి సీతారాములు.

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో గత 6 నెలలుగా గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న పెదలపై శుక్రవారం రోజున ఉదయం పోలీసులు దాడి చేసి, గుడిసెలను కూల్చివేయడాన్ని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి  సీతారాములు తీవ్రంగా ఖండించారు. 

ఈరోజు సిపిఎం రాష్ట్ర బృందం కోరుట్ల పట్టణంలోని కూల్చివేసిన గుడిసెల స్థలాన్ని రాష్ట్ర బృందం సందర్శించింది 

ఈ సందర్భంగా సీతారాములు మాట్లాడుతూ సర్వే నెంబర్ 923 గల 53 ఎకరాల భూమిలో 400 గుడిసెలు, దాదాపు లక్షా రూపాయల ఖర్చు చేసి 80 పక్కా ఇళ్ళు నిర్మించుకుని 6 నేలలుగా పేదలు, కార్మికులు నివాసం ఉంటూ, పట్టాలివ్వాలని పోరాడుతున్నారు. ఈరోజు16న తెల్లవారుజామున 4గం:ల ప్రాంతంలో వందలాది మంది పోలీసులు వచ్చి, బుల్డోజర్ల తోటి గుడిసెలను కూల్చి, విలువైన వస్తువులు, గ్యాస్ సిలిండర్లు, కుట్టు మిషన్లు, వాహనాలు, వంట సామాగ్రి తీసుకెళ్ళి పేద ప్రజలందరిని భయభ్రాంతులకు గురిచేసి, దాడులు చేసి ముఖ్య నాయకులను అరెస్టు చేసి, వివిధ పోలీస్ స్టేషన్లకు  తరలించారు. 


గత పాలకులకు  ఈ పాలకులకు ఏమి తేడా లేకుండా ఉంది. 

ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యే ఎంపీ లు ప్రభుత్వ భూములు, చెరువులు కుంటలు, కబ్జా చేస్తూ, అమ్ముకుంట్టుంటే వారిని అరెస్ట్ చేసి జైలు కు పంపకుండా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ పాలకులు దొంగలకు వత్తాసు పలుకుతూ ఉండడం సరైంది కాదన్నారు 

అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం.

నేడు ఈ ప్రభుత్వ దమన ఖండాను తీవ్రంగా ఖండించారు. వెంటనే కూల్చిన ఇండ్ల స్థలాలోనే పేదలకు ఇంటినిర్మాణం చేసి, వాటికి పట్టాలు ఇవ్వాలని. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, అలాగే అక్రమంగా అరెస్టు చేసిన వారిని, నాయకులను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు 

ఈకార్యక్రమంలో CPM రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లు లక్ష్మి, రాష్ట్ర కమిటీ సభ్యులు పి.అశయ్య, కరీంనగర్ సిపిఎం జిల్లా కార్యదర్శి వాసుదేవ రెడ్డి,CITU రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్, సిపిఎం జిల్లా నాయకులు చౌదరి,రమేష్, ఎండి సలీం, మహ్మద్  తదితరులు పాల్గొన్నారు.

.