తెలంగాణ ప్రభ(ధర్మపురి): జగిత్యాల పట్టణంలోని జంబిగద్దే వద్ద గల శ్రీకర ఆసుపత్రిలో గురువారం అరుదైన శస్త్ర చికిత్స చేసి 7 కిలోల కణతిని తొలగించారు. ఆదిలాబాద్ జిల్లాకు జన్నారంకు చెందిన 50 సంవత్సరాల ఓ మహిళ కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరగా అన్ని పరీక్షలు నిర్వహించి కడుపులో కణతి ఉందని నిర్ధారించి శుక్రవారం ఆస్పత్రి వైద్యులు డాక్టర్ చౌటపల్లి శ్రీకాంత్, డాక్టర్ నాగరాణిలు కడుపులో ఉన్న ఏడు కిలోల కణతిని శస్త్ర చికిత్స చేసి తొలగించారు. ఇంత పెద్ద ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్లకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
