బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు రాజీనామా కాంగ్రెస్ లో చేరిక.

తెలంగాణ ప్రభ (ఎల్లారెడ్డిపేట): ఎల్లారెడ్డిపేట పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బండారి బాల్ రెడ్డి శుక్రవారం రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఈ మేరకు సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఆయన మాట్లాడుతూ అవినీతికి కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంటుందన్నారు గతంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇసుక మాఫియా భూ కబ్జాలు అక్రమాలకు పాల్పడిన బిఆర్ఎస్ పార్టీ నాయకులకు తగిన గుణపాఠం చెప్పడం జరుగుతుందన్నారు చట్టానికి అతీతంగా మా కార్యకర్తలు కూడా దూరం కాదని అవినీతిని ఎవరు ప్రోత్సహించిన చట్ట ప్రకారంగా శిక్షిస్తామన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మారెడ్డి  బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్  బుగ్గ కృష్ణమూర్తి నాయకులు మల్లారెడ్డి  దేవయ్య  లింగం గౌడ్  గంట బుచ్చగౌడ్ అనవేని రవి  రాంరెడ్డి  శ్రీనివాస్  గుర్రం రాములు  రాజు  సురేష్ బాలయ్య పాల్గొన్నారు

.