తెలంగాణ ప్రభ (కోరుట్ల): శాసనసభ సమావేశాల్లో నియోజకవర్గ సమస్యలపై జీరో అవర్ లో మాట్లాడిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్
ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు సమస్యలను ప్రస్తావించారు.
కోరుట్ల మాజీ శాసనసభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఫ్లాట్ ఉన్న వాళ్లకి గృహలక్ష్మి పథకం ద్వారా ఇళ్ల మంజూరు చేశారని,
అలాగే ఫ్లాట్ లేని వాళ్లకోసం వెయ్యి (1000) ప్లాట్లు గుర్తించామని, ఎలక్షన్ నోటిఫికేషన్ వల్ల ఆ యొక్క ఫ్లాట్లు అర్హులైనటువంటి పేదవాళ్లకు పంపిణీ చేయలేకపోయామని, తొందరగా లబ్ధిదారులకు ఆ యొక్క ఫ్లాట్లు పంపిణీ చేయాలని ఆయన కోరారు.
కొంతమంది వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఆ యొక్క ఫ్లాట్లను కబ్జా చేయాలని చూస్తున్నారని, ఎంపీ ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే ఆ యొక్క ఫ్లాట్లను లబ్ధిదారులకు అందించేలా చూడాలని ఆయన అన్నారు
మెట్ పల్లి మరియు కోరుట్ల పట్టణాలలో సమీకృత వెజ్,నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణం 90 శాతం వరకు పూర్తయ్యాయని, మిగిలిన 10 శాతం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఆర్థికశాఖ మంత్రిని కోరారు.
మెట్ పల్లి పట్టణంలోని హైస్కూల్ మరియు జూనియర్ కళాశాల ఒకే భవనంలో ఉన్నాయని, Pasewise ద్వారా వాటిని విభజించి, జూనియర్ కళాశాల భవనాన్ని కూల్చివేసి నూతన భవనాన్ని నిర్మించామని,
అదేవిధంగా హైస్కూల్ భవనం శిథిలావస్థలో ఉందని, ఆ యొక్క భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఆయన తెలిపారు
అంతేకాకుండా వైద్య వృత్తి వదులుకొని ఎన్నో ఆశలతో అసెంబ్లీకి వచ్చానని, అసెంబ్లీ సమావేశాల్లో ఎవ్వరు కూడా వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడకూడదని సభాపతిని కోరారు.
.