కోరుట్ల పట్టణ అభివృద్ధికి సహకరించండి : నూతన మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి

నూతన మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ గా నూతన బాధ్యతలు స్వీకరించిన బట్టు తిరుపతి పట్టణ ప్రజలకు అధికారులకు పాత్రికేయులకు విజ్ఞప్తి చేశారు.  

ఈ సందర్భంగా  కమిషనర్ బాధ్యతలు చేపట్టిన తిరుపతిని మన ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా శాలువాతో సన్మానించి  స్వాగతం తెలిపారు. అనంతరం మన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఉరుమడ్ల శ్రీనివాస్ మనం దినపత్రిక నూతన డైరీని కమిషనర్ బట్టు తిరుపతికి బహుకరించారు. 

ఈ సందర్భంగా కమిషనర్ తిరుపతి మాట్లాడుతూ నేను చాలా కాలంగా కోరుట్ల పట్టణంలో నివసిస్తున్నానని పట్టణంలోని ప్రధాన సమస్యల పట్ల అవగాహన ఉందని, కోరుట్ల పట్టణాన్ని అన్ని విధాలుగా సుందరంగా అభివృద్ధి చేయాలంటే అధికారులు నాయకులు ముఖ్యంగా పాత్రికేయుల సహకారం అవసరమని ఆయన పేర్కొన్నారు. 

పట్టణ ప్రజలు ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.  

ఈ కార్యక్రమంలో మన ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు ఉరుమడ్ల శ్రీనివాస్, అల్లే రాము, గౌరవ సలహాదారులు కటుకం గణేష్, వనతడపుల నాగరాజు, కత్తి రాజ్ శంకర్, బాలే అజయ్, దయ మదన్ తదితరులున్నారు.

.