ఘనంగా సమ్మక్క సారక్క విగ్రహ ప్రతిష్ట మహోత్సవం

తెలంగాణ ప్రభ,(తంగళ్ళపల్లి);తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో నూతనంగా శ్రీ సమ్మక్క సారక్క విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం హోమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈనెల 22,23,24 తేదీలలో సమ్మక్క సారలమ్మ పండగను ఘనంగా నిర్వహిస్తామని, వివిధ గ్రామాల ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకోవాలని కమిటీ సభ్యులు తెలియజేశారు.

.