తెలంగాణ ప్రభ(కుత్బుల్లాపూర్): జగద్గిరిగుట్ట లోని శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి 53వ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని గురువారం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ వేంకటేశ్వర స్వామి కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబిసి రాష్ట్ర కార్యవర్గసభ్యులు జేకె శేఖర్ యాదవ్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు పున్నా రెడ్డి, బీజేపీ నాయకులు మేకల సురేష్ రెడ్డి, మోతె శ్రీనివాస్ యాదవ్, సిద్దిరాం రెడ్డి, ఓరుగంటి నరేష్, వసుందర, గండి రాజు యాదవ్, మాధవులు అరుణ్ కుమార్, ముప్పిడి రవి, జగ్గు, రేవంత్, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు
