కోరుట్ల నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్

తెలంగాణ ప్రభ (కోరుట్ల): శాసన సభ సమావేశాల్లో కోరుట్ల నియోజక వర్గ సమస్యలపై జీరో అవర్ లో మాట్లాడిన  కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ 

ఈ సందర్భంగా నియోజకవర్గ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

మొదటి సారి ఎన్నికైన నాకు నియోజకవర్గ సమస్యలపై  సభలో  మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు అసెంబ్లీ స్పీకర్ కు కృతజ్ఞతలు తెలియజేసిన ఎమ్మెల్యే సంజయ్.

సభలో నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించారు..

కోరుట్ల నియోజకవర్గం అభివృద్ధి కొరకు గత ప్రభుత్వం TUFIDC ద్వారా నిధులు మంజూరు చేసింది.

ఈ ప్రభుత్వం ఆ నిధులను ఆపేయాలని నిర్ణయం తీసుకుంది.

కావున ఆ నిధులను ఆపేయకుండా అభివృద్ధి పనులు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని సభలో ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్యే సంజయ్

కోరుట్ల నియోజకవర్గ కేంద్రమైన కోరుట్లలో డయాలసిస్ సెంటర్ నడుస్తుంది..కానీ కిడ్నీ బాధితులు ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఉన్న మిషిన్స్ సరిపోవడం లేదని, డయాలసిస్ మిషిన్స్ పెంచాలని సంబంధిత వైద్యశాఖ మంత్రి కి లెటర్ ద్వారా కూడా విన్నవించడం జరిగిందని త్వరగా దీనిపై నిర్ణయం తీసుకొని మిషిన్స్ పెంచినట్లైతే మా నియోజకవర్గ పేద కిడ్నీ బాధితులకు మేలు చేసిన వారు అవుతామని కావున ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు.

నియోజకవర్గంలో ఉన్న షుగర్ పరిశ్రమ పై ఒక కమిటీ వేసినట్టు ఈ మధ్య ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకోవడం జరిగింది.మాకు ఎలాంటి సమాచారం లేదని,ఇక్కడి చెరుకు రైతుల ప్రయోజనాలను కాపాడటానికి ఆ కమిటీ దృష్టికి తీసుకెళ్లడానికి ఈ ప్రాంత ఎమ్మెల్యేగా నాకు బాధ్యత ఉంటుందని కాబట్టి ఏ కమిటీ వేశారో ఆ కమిటీ తీసుకునే చర్యలు ఏంటో మాకు సమాచారం ఇచ్చేలా  ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సభలో ఆయన కోరారు

.