తెలంగాణ ప్రభ (ఎల్లారెడ్డిపేట): ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ అబివృద్ధి అధికారిగా సత్తయ్య గురువారం పదవి బాధ్యతలు స్వీకరించారు.గత పది సంవత్సరాలు గా ఎల్లారెడ్డిపేట ఎంపిడివో గా పనిచేసిన చిరంజీవి జగిత్యాల జిల్లా కు బదిలీ అయ్యారు.ఇంతకుముందు పెద్దపల్లి జిల్లాలో ఎంపిడిఓ గా పని చేసిన సత్తయ్య ఎల్లారెడ్డిపేట మండల అబివృద్ధి అధికారిగా బదిలీపై వచ్చారు. గురువారం ఎంపీడీవో బాధ్యతలు స్వీకరించారు.
ఎల్లారెడ్డిపేట , నారాయణ పూర్ గ్రామాల స్పెషల్ ఆఫీసర్ గా అదనపు బాధ్యతలు కూడా నిర్వహించనున్నారు. మండల పరిషత్ సూపరింటెండెంట్ శ్రీ నివాస్, మండల పంచాయతీ అధికారి వజీర్ హైమద్ , టైఫిస్ట్ రాజు నాయక్, ఆపీస్ సిబ్బంది , వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
.