ధర్మపురి ఎంపీడీవో గా రవీందర్

తెలంగాణ ప్రభ(ధర్మపురి): ధర్మపురి మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారిగా  పి రవీందర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన ఎంపీడీవో రవీందర్ ను కార్యాలయ సిబ్బంది అధికారులు ఎంపీపీ  చిట్టిబాబు తదితరులు గురువారం స్వాగతం పలికి సన్మానించారు. సిరిసిల్ల జిల్లా చందుర్తి నుండి ఇటీవల బదిలీపై ధర్మపురికి వచ్చారు.మండలం లోని పంచాయతీ కార్యదర్శులు,సిబ్బంది శాలువ లు కప్పి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ నరేష్,సీనియర్,జైన సహకార సంఘం అధ్యక్షుడు సౌల్ల నరేష్, అసిస్టెంట్ అజయ్ రెడ్డి జూనియర్ అసిస్టెంట్ మహేష్,కార్యదర్శులు మామిడిపెళ్లి మహేష్,ఉపేందర్ నాయక్,లక్ష్మణ్, రాజు,నవీన్,ముత్యం,చందన కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

.