తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తనిఖీ చేశారు
ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ పోలీస్ స్టేషన్ పరిసరాలను, మరియు రిసెప్షన్, స్టేషన్ రైటర్, ఎస్ హెచ్ వో, రెస్ట్ రూమ్ , లాక్ అప్ రూమ్ ను పరిశీలించారు.
5S అమలు తీరును పరిశీలించారు.
పోలీస్ స్టేషన్ లో ఎంత మంది సిబ్బంది ఉన్నారు, వారు ఏ ఏ విధులు నిర్వహిస్తున్నారో పరిశీలించారు. పోలీస్ స్టేషన్ నుండి రోజు ఎన్ని బ్లూ కోల్ట్స్, పెట్రో కార్స్ విధులు నిర్వహిస్తున్నాయని, పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడెక్కడ ఎన్ని బిట్స్ నడుస్తున్నాయని తెలుసుకొని ప్రాపర్ గా పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని ఆయన ఆదేశించారు.
డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని, బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ నిరంతరం 24x7 గస్తీ నిర్వహించాలని , సిబ్బంది తమకు కేటాయించిన గ్రామాల పూర్తి సమాచారం అందరి దగ్గర ఉండాలని, ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉంటూ, ప్రజల సమస్యలను తీర్చాలని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని ఆయన సూచించారు. గ్రామాలలో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రాముఖ్యతను ప్రజలకు వివరించాలని, సైబర్ నేరాల పట్ల ప్రజలతో పాటు యువతను అప్రమత్తం చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కోరుట్ల సీ.ఐ ప్రవీణ్ కుమార్, ఎస్.ఐ శ్యామ్ రాజ్, సిబ్బంది పాల్గొన్నారు
.