తెలంగాణ ప్రభ(ధర్మపురి): ఈనెల 7 నుండి 11 వరకు న్యూ ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగిన 3 వ అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ పోటీల్లో ధర్మపురి మండలంలోని తుమ్మెనాలకు చెందిన మామిడిపెల్లి గణేష్ తెలంగాణ రాష్ట్ర జట్టుకు కోచ్ గా వ్యవహరించి,జాతీయ స్థాయి కోచ్ గా శిక్షణ పూర్తిచేసుకొని, సర్టిఫికేట్ సాధించినట్లు కిక్ బాక్సింగ్ చీఫ్ ఇన్స్ స్త్రక్టర్ కస్తూరి ప్రవీణ్ తెలిపారు.
గణేష్ ను వాకో ఇండియా ప్రెసిడెంట్ సంతోష్ అగర్వాల్,ఇండియా చీఫ్ కోచ్ సురేష్ బాబు,తెలంగాణ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు రామాంజనేయులు,అభినందించారు.
.